నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఎక్స్‌ట్రా. ఆర్డనరీ మాన్ అనేది ఉపశీర్షిక. నితిన్ కు జోడిగా లేటెస్ట్ సెన్షేషన్ శ్రీలీల నటిస్తోంది. వక్కంతం వంశీ దర్శకుడు. సుధాకర్‌రెడ్డి, నికితారెడ్డి నిర్మాతలు. ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్ర కోసం రాజశేఖర్‌ని ఎంచుకొన్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఆయన సెట్స్‌లోకి అడుగుపెట్టారు. కథలో రాజశేఖర్ పాత్ర చాలా కీలకం. ఆయన లుక్ చాలా స్టైలీ్‌షగా ఉంటుంది. ఆయన రాకతో మా బలం మరింత పెరిగింది. డిసెంబరు 8న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు.