Namaste NRI

నిలకడగానే రజనీ ఆరోగ్యం

తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ అనారోగ్యానికి లోనయ్యారు. సోమవారం రాత్రి తీవ్ర కడుపునొప్పితో రజనీ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు హృదయ నాళంలో సమస్యను గుర్తించి, రజనీకి స్టెంట్ వేశారు. ఆస్పత్రి వర్గాలు రజనీకాంత్ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులెటిన్ని విడుదల చేశాయి. హృదయ నాళానికి సంబంధించిన చికిత్స చేసినట్టు ఈ బులెటిన్లో వారు వెల్లడించారు. రజనీ ఆరోగ్యం నిలకడగానే ఉందనీ, మరో రెండురోజుల్లో డిశ్చార్జ్ అవుతారని వారు బులెటన్ ద్వారా పేర్కొన్నారు. మరోవైపు ఈ విషయంపై రజనీకాంత్ భార్య లత కూడా స్పందించారు. రజనీకాంత్ ఆరోగ్యం మెరుగుపడిందని, నిలకడగానే ఉన్నారని అభిమానులకు ఆమె తెలియజేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress