రవితేజ నున్నా, నేహ జురెల్ జంటగా నటిస్తున్న చిత్రం రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి. సత్యరాజ్ దర్శకుడు. ముత్యాల రామదాసు, నున్నా కుమారి నిర్మించారు. నాగినీడు, ప్రమోదిని, జబర్దస్త్ బాబీ తదితరులు నటిస్తున్నారు. ట్రైలర్‌ను ఆవిష్కరించారు. గ్రామీణ నేపథ్యంలో లవ్, కామెడీ, సస్పెన్స్ నేపథ్యం లో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కథానాయిక హత్య నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఉత్కంఠగా అనిపించాయి. రాజుగారి అమ్మాయి ఎలా చనిపోయిందనే అంశం సస్పెన్స్‌ను మిగిల్చింది. దర్శకుడు మాట్లాడుతూ అందమైన గోదావరి పల్లెల నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రమిది. కథలోని క్రైమ్ ఎలిమెంట్ ఆసక్తినిరేకెత్తిస్తుంది అన్నారు. అన్ని కమర్షియల్ అంశాలతో ప్రేక్షకులు మెచ్చేలా ఈ చిత్రాన్ని తీర్చిది ద్దామని, మార్చి 9న విడుదల చేస్తున్నామని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మురళీకృష్ణవర్మ, సంగీతం: రోషన్ సాలూరి, దర్శకత్వం: సత్యరాజ్.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)