రాహి అనిల్ బార్వే దర్శకత్వంలో వస్తున్న తాజా వెబ్ సిరీస్ రక్త్ బ్రహ్మాండ్ . ది బ్లడీ కింగ్‌డమ్ అనేది ఉప శీర్షిక. ఈ వెబ్ సిరీస్‌ను ఫ్యామిలీ మ్యాన్ దర్శకులు రాజ్ డీకే నిర్మించబోతున్నారు. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.ఈ ఫస్ట్ లుక్‌లో క్రౌన్ (కిరీటం)పై రక్తం పారుతున్నట్లు కనిపిస్తుంది. ఇక ఫాంటసీ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సిరీస్‌లో సమంత, బాలీవుడ్ నటుడు ఆదిత్య రాయ్ కపూర్ ప్రధాన పాత్రలో నటించనున్నట్లు సమాచారం. కాగా ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.