ప్రగతిభవన్‌లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన సోదరీమణులు, లక్ష్మమ్మ, జయమ్మ, లలితమ్మ ముగ్గురూ హారతి పట్టి రాఖీలు కట్టి ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో కేసీఆర్ సతీమణి శోభ, మంత్రి కేటీఆర్ దంపతులు, ఎంపీ సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్, ఆయన కుమారుడు హిమాన్ష్‌కు కుమార్తె అలేఖ్య రాఖీ కట్టింది. వ్యక్తిగత పనులపై అమెరికా వెళ్లిన ఎమ్మెల్సీ కవిత సోదరుడు కేటీఆర్‌కు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ సంతోష్ సోదరి సౌమ్య తన అన్నయ్యతో పాటు మంత్రి కేటీఆర్‌కు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.