రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ఆపరేషన్ రావణ్. సంగీర్తన విపిన్ కథానాయిక. వెంకట సత్య దర్శకత్వం. ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. ట్రైలర్‌ను హీరో విశ్వక్‌సేన్ విడుదల చేశారు. సీరియల్ కిల్లర్‌ను పట్టుకునేందుకు చేపట్టే ఆపరేషన్ నేపథ్యంలో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మన ఆలోచనలే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయనే ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో ఈ సినిమాను రూపొందించానని, మంచి ఆలోచనలు ఉన్న రాముడు దేవుడైతే, చెడు ఆలోచనలు కలిగిన రావణుడు రాక్షసుడయ్యాడనే ఫిలాస ఫీతో ఈ సినిమా ఆకట్టుకుంటుందని దర్శకుడు వెంకట సత్య తెలిపారు.
సైకో థ్రిల్లర్ కథాంశమిదని, ఆద్యంతం ఉత్కంఠభరితమైన మలుపులతో సాగుతుందని హీరో రక్షిత్ అట్లూరి పేర్కొన్నారు. ఈ సినిమాలో తాను జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తానని కథానాయిక సంగీర్తన విపిన్ చెప్పింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. ఆగస్ట్ 2న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: శరవణ వాసుదేవన్, రచన-దర్శకత్వం: వెంకట సత్య.