మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , డైరెక్టర్ బుచ్చిబాబు కలయికలో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాగా, త్వరలోనే షూటింగ్ ప్రారంభించ నున్నారు. ఇక ఆర్‌సీ 16 అని వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఉత్తరాంధ్రలో జరిగే క్రీడా నేపథ్యంలో రానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుండగా, తాజాగా మూవీ లాంఛ్‌కు సంబంధించి సాలిడ్ అప్‌డేట్‌ను ఇచ్చారు మేకర్స్.
ఈ సినిమాను మార్చి 20న అధికారికంగా లాంఛ్ చేయనున్నట్లు సమాచారం. మార్చి 20న హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలు జరపడంతో పాటు ప్రెస్‌మీట్ కూడా నిర్వహించబోతున్నారని టాక్. ఈ వేడుకకు టాలీవు డ్ స్టార్ హీరో కూడా రానున్నట్లు సమాచారం. మరోవైపు ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ బ్యాగ్‌డ్రాప్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్ సమర్పిస్తు న్నది. వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలపై వెంకటసతీశ్ కిలారు అత్యంత భారీ వ్యయంతో నిర్మించనున్నారు. యూనివర్సల్ అప్పీల్ ఉండే పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ని బుచ్చిబాబు సిద్ధం చేశారని యూనిట్ సభ్యులు తెలిపారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. జాన్వి కపూర్ ఇందులో కథానాయిక. విజయ్‌సేతుపతి విలన్‌గా నటిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.














