Namaste NRI

అలనాటి రామచంద్రుడు కూడా వచ్చేస్తున్నాడు

యంగ్‌హీరో కృష్ణవంశీ, మోక్ష జంటగా నటిస్తున్న లవ్‌ ఎంటర్‌టైనర్‌ అలనాటి రామచంద్రుడు. చిలుకూరి ఆకాశ్‌రెడ్డి దర్శకుడు. హైమావతి జడపోలు, శ్రీరామ్‌ జడపోలు నిర్మాతలు. ఈ సందర్భంగా థియేట్రికల్‌ ట్రైలర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. ఈ కథలోని డ్రామాని, భావోద్వేగాల తీవ్రతను ట్రైలర్‌లో చూపించే ప్రయత్నం చేశారు. అర్థవంతమైన సంభాషణలు, హత్తుకునే సన్నివేశాలతో కూడిన మంచి రొమాంటిక్‌ డ్రామా ఈ సినిమా అని, కృష్ణవంశీ, మోక్ష అద్భుతంగా నటించారని మేకర్స్‌ చెబుతున్నారు. బ్రహ్మాజీ, వెంకటేశ్‌ కాకు మాను, సుధ, ప్రమోదిని, చైతన్య గరికపాటి తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఆగస్ట్‌ 2న సినిమా విడుద ల కానుంది.  ఈ చిత్రానికి కెమెరా: ప్రేమ్‌సాగర్‌, సంగీతం: శశాంక్‌.టి, సహ నిర్మాత: కె.జగదీశ్వర్‌రెడ్డి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress