ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ తేజ్, ఆయన సతీమణి ఉపాసన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను కలిశారు. ముంబైలోని తన నివాసానికి వచ్చిన రామ్ చరణ్ తేజ్ దంపతులకు సీఎం షిండే సాదర స్వాగతం పలికారు. మీ అసాధారణమైన ఆతిథ్యం, ఆప్యాయతకు హృదయపూర్వక కృతజ్ఞతలు అని ఉపాసన పేర్కొన్నారు రామ్ చరణ్, ఉపాసనతో సమావేశం బాగా జరిగిందని షిండే తెలిపారు. తమ ఇంటికి వచ్చిన రామ్ చరణ్ దంపతులకు పుష్పగుచ్ఛంతోపాటు వినాయకుడి విగ్రహాన్ని ఇచ్చి ఆహ్వానించినట్లు పేర్కొన్నారు షిండే. సినీ రంగంతోపాటు పలు అంశాలపై తమ మధ్య సానుకూల చర్చలు జరిగాయన్నారు. ఈ భేటీలో షిండే తనయుడు, ఎంపీ శ్రీకాంత్, ఆయన సతీమణి వృశాలి ఉన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)