
నటీనటుల ముఖాలు కనిపించకుండా కేవలం కథ, కథనాల మీద సినిమాను నడిపిస్తూ ఓ వైవిధ్యమైన ప్రయోగంతో తెరకెక్కిస్తున్న చిత్రం రా రాజా. బి.శివప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీపద్మిని సినిమాస్ సంస్థ నిర్మించింది. ఈ నెల 7న విడుదలకానుంది. ప్రెస్‌మీట్ నిర్వహించారు. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందించే ప్రయోగాత్మక చిత్రమని దర్శకుడు తెలిపారు. ఇప్పటివరకు తెలుగులో రాని కాన్సెప్ట్ ఇదని సంగీత దర్శకుడు శేఖర్‌చంద్ర పేర్కొన్నారు. సినిమా బాగా వచ్చిందని ఛాయాగ్రాహకుడు రాహుల్ శ్రీవాత్సవ్ చెప్పారు.
