Namaste NRI

ఆర్య పుట్టినరోజు సందర్భంగా రంజీ టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్ విడుదల

ఆర్య హీరోగా రూపొందుతున్న స్పోర్ట్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ రంజీ. పోలూరు కృష్ణ దర్శకుడు. మురుకుంట్ల అరవింద్‌, విజయభారతి నిర్మాతలు. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్నది. హీరో ఆర్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌తోపాటు ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. ఇంటెన్స్‌, పవర్‌ఫుల్‌ ప్రెజెన్స్‌తో కనిపిస్తున్న ఆర్యను ఈ పోస్టర్‌లో చూడొచ్చు. ఈ పాత్ర ఎంత ప్రభావవంతంగా ఉండబోతుందో ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ చెబుతున్నది. వ్రంజనా పాండ్య కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో దశరథ్‌, వాసుకి, ఆడుకాలం నరేన్‌, సమ్మెట గాంధీ కీలక పాత్రదారులు. ఈ చిత్రానికి కెమెరా: రామ్‌ కె.మహేశ్‌, సంగీతం: రధన్‌, సమర్పణ: ఆకృతి నంద.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events