ఆట సందీప్, మేఘన రాజ్‌పుత్ ప్రధాన నటిస్తున్న సినిమా రేంజ్ రోవర్. అరవింద్ యతిరాజ్, బ్యాంక్ జనర్ధాన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను నటుడు అలీ విడుదల చేశారు. అనంతరం టైటిల్ బాగుందని, సినిమా విజయం సాధించాలని కోరుతూ చిత్ర బృందానికి విశెస్ తెలిపారు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు విజయం చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని ఓఎస్‌ఆర్ కుమార్ ఇండియన్ పిక్చర్ పతాకంపై ఓఎస్‌ఆర్ కుమార్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాజ్ శివశంకర్, సంగీతం :సత్య సోమేష్.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/telusukada-300x160.jpg)