Skip to main content

Namaste NRI

రేంజో రోవర్‌ టైటిల్‌  ఫస్ట్‌ లుక్‌

ఆట సందీప్‌, మేఘన రాజ్‌పుత్‌ ప్రధాన నటిస్తున్న సినిమా రేంజ్‌ రోవర్‌.  అరవింద్‌ యతిరాజ్‌, బ్యాంక్‌ జనర్ధాన్‌ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథతో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను నటుడు అలీ విడుదల చేశారు. అనంతరం టైటిల్‌  బాగుందని, సినిమా విజయం సాధించాలని కోరుతూ చిత్ర బృందానికి విశెస్‌ తెలిపారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు విజయం చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని ఓఎస్‌ఆర్‌ కుమార్‌ ఇండియన్‌ పిక్చర్‌ పతాకంపై ఓఎస్‌ఆర్‌ కుమార్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాజ్‌ శివశంకర్‌, సంగీతం :సత్య సోమేష్‌.

Social Share Spread Message

Latest News