రష్మిక మందన్న నటిస్తున్న తాజా చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. గీతా ఆర్ట్స్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మిస్తున్నారు. దీక్షిత్‌శెట్టి కథానాయకుడు. హృద్యమైన ప్రేమకథగా రూపొందిస్తున్న ఈ సినిమా నుంచి నదివే అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు.

ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుందని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: అల్లు అరవింద్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్, రచన-దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్.















