ధనుష్ హీరోగా స్వీయదర్శకత్వంలో నటిస్తున్న చిత్రం రాయన్. సందీప్‌కిషన్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన తొలిపాటను మేకర్స్ విడుదల చేశారు. తలవంచి ఎరగడే అంటూ సాగే ఈ పాటను చంద్రబోస్ రాయగా, ఏ.ఆర్.రెహమాన్ స్వరపరిచారు. శరత్ సంతోష్ ఆలపించారు. ధనుష్ ఓ ఉత్సవంలో కొందరు గ్రామస్థులతో కలిసి మాస్ డాన్స్ చేస్తూ ఈ పాటలో కనిపించారు. రెహమాన్ సంగీతానికి ప్రభుదేవా కొరియోగ్రఫీ తోడవ్వడం వల్ల ఈ పాట కొత్త అందాన్ని సంతరించుకుందని, మాస్‌తో పాటు అన్ని వర్గాలకూ నచ్చే సినిమా ఇదని మేకర్స్ తెలిపారు.
ఎస్.జె.సూర్య, సెల్వరాఘవన్, అపర్ణ బాలమురళి, ధుషార విజయన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ పాన్‌ఇండియా చిత్రం జూన్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: ఓం ప్రకాశ్.