ప్రధాని నరేంద్ర మోదీ 125 రూపాయల నాణాన్ని విడుదల చేశారు. హరే క్రిష్ణ ఉద్యమ వ్యవస్థాపకులు స్వామి ప్రభుపాద 125వ జన్మదిన వార్షికోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక నాణాన్ని విడుదల చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ.కిషన్ రెడ్డితో పాటు ఇస్కాన్ ప్రతినిధులు హాజరయ్యారు. శ్రీల భక్తివేదాంత స్వామి ప్రభుపాదజీవితం సుఖసంతోషాల మిళితమన్నారు. లక్షలాది మంది ఆయన అనుచరులు, కోట్లాది మంది శ్రీక్రిష్ణభక్తులు స్వామి ప్రభుపాద జీవిత అనుభూతుల్ని పొందాలని కోరారు. స్వామి ప్రభుపాద భారతీయ మత నాయకుడు. హరే క్రిష్ణ ఉద్యమం, ఇస్కాన్‌ను స్థాపించారు. 1896 ఏడాది కలకత్తాలో ఆయన జన్మించారు. క్రిష్టబోధనల ప్రచారానికి 1959లో భారత్ నుంచి విదేశాలకు వెళ్లారు.