అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (81) వయసు, జ్ఞాపకశక్తిపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో ఆయనను పదవి నుంచి తొలగించాలని వెస్ట్ వర్జీనియా అటార్నీ జనరల్ పాట్రిక్ మోరిసే కోరారు. అందుకోసం 25వ రాజ్యాంగ సవరణను అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఆయన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు ఓ లేఖ రాశా రు. బైడెన్ జ్ఞాపకశక్తిలో అనేక లోపాలను గుర్తించామంటూ అమెరికా స్పెషల్ కౌన్సెల్ రాబర్ట్ హుర్ గత వారం ఓ నివేదికను విడుదల చేసిన విషయాన్ని ఆ లేఖలో ప్రస్తావించారు. బైడెన్ జ్ఞాపకశక్తిలో వచ్చిన మార్పును అమెరిక న్లు చాలా కాలం నుంచి గమనిస్తున్నారని, బైడెన్ జ్ఞాపకశక్తి లోపాలు స్పష్టంగా కనిపించాయని తెలిపారు.