Namaste NRI

ఆ తీర్పును రద్దుచేయండి..డొనాల్డ్‌ ట్రంప్‌

యూఎస్‌ క్యాపిట్‌ దాడి వ్యవహారం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు తలనొప్పిగా మారింది. అధ్యక్ష పీఠాన్ని రెండోసారి కైవసం చేసుకోవాలని తహతహలాడుతున్న ఆయనకు వరుసగా ఎదురుదెబ్బలు తగులు తున్నాయి. ప్రెసిడెంట్‌ పదవికి ట్రంప్‌ అనర్హుడని కొలరాడో సుప్రీంకోర్టుతోపాటు మైన్‌ రాష్ట్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొలరాడో కోర్టు తీర్పును యూఎస్‌ సుప్రీం కోర్టును  ట్రంప్‌ అభ్యర్థించారు. గతేడాది డిసెంబర్‌ నెలలో అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయడానికి అనర్హుడిగా ప్రకటిస్తూ కొలరాడో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.

తాజాగా దానిని రద్దుచేయాలని కోరుతూ యూఎస్‌ సుప్రీం కోర్టులో ట్రంప్‌ న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ కొలరాడో కోర్టు ఉత్తర్వులను అమలుచేయానికి అనుమతించినట్లయితే అధ్యక్షపదవి రేసులో ముందంజలోఉన్న అభ్యర్థికి ప్రజలు ఓట్లేయకుండా చేసినట్లవుతుందని, ఇది అమెరికా చరిత్రలోనే తొలిసారని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events