ప్రధాని మోదీ నేతృత్వంలో కొత్త క్యాబినెట్ మంత్రులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిం దే. అయితే ఆ మంత్రుల్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ డాక్టర్ చంద్ర శేఖర్ పెమ్మసాని, అత్యంత సంపన్న మంత్రి గా నిలిచారు. చంద్రశేఖర్ పెమ్మసాని తన ఆస్తులను రూ.5705 కోట్లుగా చూపించారు. 18వ లోక్‌సభ మంత్రి మండలిలో ఆయనే సంపన్న మంత్రిగా ఉన్నారు. కేంద్ర సహాయ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారంచేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అత్యంత సంపన్న ఎంపీ అభ్యర్థిగా కూడా ఆయనే నిలిచారు.
కేంద్ర క్యాబినెట్ ర్యాంక్ మంత్రుల్లో మాత్రం జ్యోతిరాధిత్య సింథియా రూ.484 కోట్లతో అత్యంత సంపన్న మంత్రి గా నిలిచారు. లోక్‌సభకు ఎన్నికైన వారిలో సింథియా రిచ్చెస్ట్ ఎంపీల్లో ఆరవ స్థానంలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన టాప్ 10 రిచ్చెస్ట్ ఎంపీల్లో, పెమ్మసాని, సింథియా మాత్రమే మంత్రలుగా ప్రమాణ స్వీకారం చేశారు.