Namaste NRI

మంత్రి నదీమ్ జహావి షాక్ ఇచ్చిన రిషి సునాక్

బ్రిటన్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం నుంచి కన్జర్వేటివ్ పార్టీ చైర్మన్ నదీమ్ జహావిని ప్రధాని రిషి సునక్ తొలగించారు. జహావి పన్ను వ్యవహారాలపై స్వతంత్ర దర్యాప్తునకు సునాక్ ఆదేశించారు. ఆయన ఇచ్చిన పన్ను నివేదికలు సరైనవి కావని విచారణలో తేలడంతో ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. పాలక టోరీ పార్టీ చీఫ్గా ఎలాంటి పోర్ట్ఫోలియో లేకుండా మంత్రిగా ఉన్న నదీమ్ జహావి, హిజ్ మెజెస్టి రెవిన్యూ అండ్ కస్టమ్స్ తో పెనాల్టీ సెటిల్మెంట్కు అంగీకరించినట్లు వెల్లడైన తర్వాత అతడి ఆర్థిక విషయాలపై పలు ప్రశ్నలు బయటకొచ్చాయి. మంత్రివర్గ నియమావళిని తీవ్రంగా ఉల్లంఘించినట్లు స్పష్టమవుతున్నందున ప్రభుత్వ పదవి నుంచి తొలగిస్తున్నట్లు తెలిపే ఒక లేఖను జహావికి సునాక్ పంపించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events