ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. పాన్ ఇండియా కథాంశంతో వస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలోని ఓ పాట కోసం జక్కన్న, తారక్, చెర్రీ టీం ఉక్రెయిన్ లోనే ఉంది. జక్కన్న అండ్ టీం ఉక్రెయిన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే పాట చిత్రీకరణను పూర్తి చేసింది. తాజా షెడ్యూల్ తో ఆర్‌ఆర్‌ఆర్ మొత్తం షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా రాజమౌళి, సెంథిల్ కుమార్ ఇతర టీం సభ్యులంతా కలిసి దిగిన సెల్ఫీ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండిరగ్ అవుతోంది. 10 రోజుల షూటింగ్ అనంతరం హైదరాబాద్ చేరుకుంది. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ ఫైనల్ అప్డేట్ వచ్చింది.
రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు. ఎన్టీఆర్ కొమ్రం భీం రోల్ పోషిస్తున్నాడు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి అలియాభట్, హాలీవుడ్ నటి ఒలివియా మొర్రీస్ ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. శ్రియా శరణ్, అజయ్ దేవ గన్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా ఆర్‌ఆర్‌ఆర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.