మాజీ ఐపిఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగస్టు 8న బహుజన సమాజ్‌పార్టీ (బీఎస్పీ)లో చేరనున్నారు. ఐపిఎస్‌కు స్వచ్ఛంధ విరమణ ప్రకటించిన తరువాత ప్రవీణ్‌కుమార్ భవిష్యత్ ప్రయాణంపై అనేక పుకార్లు వచ్చినప్పటికీ వాటినన్నింటినీ ఆయన కొట్టి పారేశారు. అయితే పలు సందర్భాల్లో మీడియా ముందుకు వచ్చిన ఆయన్ను బీఎస్పీలో చేరుతారా అన్న ప్రశ్నకు నేడు ఇప్పుడు ఏమీ చెప్పలేనంటూ ఆయన దాటవేశారు. తాజాగా తన సన్నిహిత వర్గాల ద్వారా మాయవతి నేతృత్వం వహిస్తున్న బీఎస్సీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఒకవేళ ప్రవీణ్‌కుమార్ పార్టీలోకి చేరే నిర్ణయం తీసుకుంటే భారీ బహిరంగ సభతో ప్రజల ముందుకు రానున్నారని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. స్వచ్ఛంధ విరమణ ప్రకటించిన వెంటనే ప్రవీణ్ కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారనే ప్రచారం కూడా జరిగింది.