Namaste NRI

రూల్స్ రంజన్ రిలీజ్ డేట్ ఖరారు

కిరణ్‌ అబ్బవరం, నేహాశెట్టి జంటగా నటిస్తున్న తాజా చిత్రం రూల్స్‌ రంజన్‌. రత్నంకృష్ణ దర్శకుడు. ఈ మూవీని ఏఎం రత్నం సమర్పణలో స్టార్ లైట్‌ ఎంటర్‌ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దివ్యాంగ్‌ లావణ్య, మురళీ కృష్ణ వేమూరి తెరకెక్కిస్తున్నారు.  మంగళవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. మనోరంజన్‌ అనే యువకుడి కథ ఇది. కాలేజీలో తన రూల్స్‌ మాత్రమే ఫాలో కావాలనుకునే పంతం ఎలాంటి పరిస్థితులకు దారితీసింది? ఈ క్రమంలో ఎలాంటి వినోదం పండిందన్నదే చిత్ర కథాంశం. ఇటీవల విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నది. సంపూర్ణ హాస్యరసభరిత చిత్రంగా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అని చిత్రబృందం పేర్కొంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే మేకర్స్‌ లాంఛ్‌ చేసిన ఫస్ట్‌ లుక్‌, సాంగ్స్‌,టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.

ఈ చిత్రంలో మెహర్ చాహల్‌, వెన్నెల కిశోర్‌, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, అన్నూ కపూర్‌, అజయ్‌, అతుల్ పర్చురే, విజయ్‌ పాట్కర్‌, మకరంద్‌ దేశ్‌పాండే, నెల్లూరు సుదర్శన్‌, గోపరాజు రమణ, అభిమన్యు సింగ్, సిద్దార్థ్ సేన్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. . ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 6న విడుదల చేయబోతున్నారు.  ఈ చిత్రానికి సంగీతం: అమ్రిష్‌ గణేష్‌, నిర్మాతలు: దివ్యాంగ్‌ లవానియా, మురళీకృష్ణ వేమూరి, రచన-దర్శకత్వం: రత్నం కృష్ణ.

Social Share Spread Message

Latest News