ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్‌లో జరిగిన తొక్కిసలాటలో పలువురు మరణించిన ఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన వారికి సంతాపం తెలుపుతూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీలకు ఈ ఘటనపై పుతిన్ సంతాప సందేశం పంపారు. మృతుల కుటుంబాలకు తన సంతాపం తెలియచేయాలని కోరారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని పుతిన్ ఆకాంక్షించారు.