ఉక్రెయిన్ యుద్దానికి సంబంధించి ఐక్యరాజ్యసమితిలో తీసుకొచ్చిన మరో తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. అయితే ఈసారి ఆ తీర్మానం ప్రవేశపెట్టింది రష్యా కావడం గమనార్హం. ఉక్రెయిన్ జీవాయుధాలు, తయారు చేస్తోందని ఆరోపిస్తోన్న మాస్కో, దానిపై దర్యాప్తు చేపట్టాలంటూ తీర్మానం తీసుకొచ్చింది. దీనిపై ఓటింగ్ నిర్వహించగా, భారత్ అందులో పాల్గొనలేదు. ఉక్రెయిన్ జీవాయుధాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ అమెరికాతో కలిసి లాబోరేటరీల్లో మిలిటరీ బయోలాజికల్ కార్యకలాపాలు సాగిస్తోందని రష్యా కొంతకాలంగా అరోపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఓ కమిషన్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఐరాసలో భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టింది. అయితే ఈ తీర్మానం వీగిపోయింది. కేవలం రష్యా, చైనా మాత్రమే దీనికి అనుకూలంగా ఓటెయ్యగా.. అమెరికా, యూకే, ఫ్రాన్స్ వ్యతిరేకించాయి. భారత్ సహా భద్రతా మండలిలోని మిగిలిన సభ్య దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.














