తమిళ అగ్ర హీరో ధనుష్ నటిస్తున్న చిత్రం రాయన్. ఆయనే దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సందీప్‌కిషన్, కాళిదాస్ జయరామ్ ఇతర ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. అతనో సాధారణ వ్యక్తి. మద్రాస్‌లోని ఓ హోటల్‌లో చెఫ్‌గా పనిచేస్తుంటాడు. కానీ అతని గతం మాత్రం పగతో రగిలిపోతుంటుంది. ప్రతీకారం తీర్చుకునే సమయం కోసం ఎదురుచూస్తుంటాడు. ఇంతకి ఆ వ్యక్తి ప్రతీకారం ఎవరి మీద? పేరు మోసిన గ్యాంగ్‌స్టర్ అయిన అతను హోటల్‌లో చెఫ్‌గా ఎందుకు పనిచేయాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే రాయన్ సినిమా చూడాల్సిందే అని చెబుతోంది చిత్ర బృందం. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్ టైన్‌మెంట్ తెలుగులో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నది.