శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న తాజా తమిళ చిత్రం అమరన్. సాయిపల్లవి కథానాయికగా. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకుడు. శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్ అనే పుస్తకంలోని మేజర్ వరదరాజన్ అధ్యాయం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మేజర్ వరదరాజన్ పాత్రను శివకార్తికేయన్ పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఇందు రెబెకా వర్గీస్‌గా సాయిపల్లవిని పరిచయం చేస్తూ ఇంట్రో వీడియోను విడుదల చేశారు. రిపబ్లిక్ డే పరేడ్‌తో మొదలైన ఈ ఇంట్రో వీడియో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇందులో సాయిపల్లవి తనదైన నటనతో కట్టిపడేసింది. సాయిపల్లవి, శివకార్తికేయన్ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. దేశభక్తి, సాహసం ప్రధానంగా ఈ సినిమా స్ఫూర్తివంతంగా సాగుతుందని, దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి తెలుగు రాష్ర్టాల్లో విడుదల చేయబోతున్నారు.