కృష్ణా జలాలపై ఏపీ సర్కార్ దాదాగిరీ చేస్తోందన్న తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కృష్ణా జలాలపై ఎవరు దాదాగిరీ చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని అన్నారు. అసలు వివాదాన్ని ఎవరు రగిలించారో కూడా తెలుసని కౌంటర్ ఇచ్చారు. జల విద్యుత్ పేరుతో 30 టీఎంసీల నీటిని తెలంగాణ సముద్రం పాలు చేసిందని ఎద్దేవా చేశారు. ఎగువ ప్రాంతంలో ఉన్నామన్న భావంతోనే తెలంగాణ తమతో తగువుకు దిగిందని, అయినా ఏపీ హక్కుల విషయంలో సీఎం జగన్ ఎక్కడా రాజీపడలేదని సజ్జల పేర్కొన్నారు.