బ్రిటన్ రాజధాని లండన్‌లో సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. ఇండియన్స్ ఇన్ థుర్రాక్ సంస్థ ఆధ్వర్యంలో స్కాట్స్ ఒకెండన్‌లో పండుగను సందడిగా నిర్వహించారు. తెలుగవారితో పాటు తమిళులు, పంజాబీలు, పలువురు ఉత్తర భారతీయులు ఇందులో భాగమై భోగీ, మకర సంక్రాంతి, లోహ్రీ, పొంగల్ వేడుకల ను కలిసికట్టుగా చేసుకున్నారు. థుర్రాక్ లేబర్ కౌన్సిలర్‌గా ఎన్నికైన తెలుగు వ్యక్తి శ్రీకాంత్ పంజాల ప్రత్యేక అతిథిగా పాల్గొని, అందరికీ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకెంతో ఆనందం కలిగించిందని, తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. నిర్వాహకుల ప్రయత్నాన్ని అభినందించిన ఆయన భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్యక్రమాల నిర్వహణకు కౌన్సిల్‌పరంగా తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.















