Namaste NRI

శశివదనే పెద్ద హిట్ అవుతుంది

రక్షిత్‌ అట్లూరి, కోమలి ప్రసాద్‌ జంటగా నటించిన చిత్రం శశివదనే. సాయిమోహన్‌ ఉబ్బర దర్శకుడు. అహితేజ బెల్లంకొండ, అభిలాష్‌రెడ్డి గోడల నిర్మాతలు. శ్రీమాన్‌, దీపక్‌ ప్రిన్స్‌, జబర్దస్త్‌ బాబీ, రంగస్థలం మహేశ్‌ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.   ఈ సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. విడుదలైన ప్రచార చిత్రాలు ఎంత సున్నితంగా అనిపిస్తున్నాయో, సినిమా కూడా అంత హార్ట్‌ టచింగ్‌గా ఉంటుంది.

ఇలాంటి గొప్ప కథతో దర్శకుడ్ని కావడం నా అదృష్టం. సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతు న్నాను  అని దర్శకుడు అన్నారు. భావోద్వేగాల మేళవింపుగా ఈ సినిమా ఉంటుందని, దర్శకుడు సాయి మోహన్‌ ఈ సినిమాతో పెద్ద దర్శకుడు అవుతాడని, సాంకేతికంగా కూడా ఈ సినిమా అందరికీ నచ్చుతుందని హీరో రక్షిత్‌ చెప్పారు. ఇంకా చిత్రయూనిట్‌ మొత్తం మాట్లాడారు.  నిర్మాణంలో తుది మెరుగులు దిద్దుకుంటు న్న ఈ చిత్రం వచ్చే నెల 19న విడుదల కానుంది.  ఈ చిత్రానికి కెమెరా: శ్రీసాయికుమార్‌ దారా, సంగీతం: శరవణ వాసుదేవన్‌, నేపథ్యసంగీతం: అనుదీప్‌దేవ్‌.

Social Share Spread Message

Latest News