నాని కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వం. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఆగస్ట్ 29న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ను మొదలుపెట్టారు. ఈ చిత్రం ఫస్ట్‌సింగిల్‌ను ఈ నెల 15న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
కథానుగుణంగా జేమ్స్ బిజోయ్ మంచి సంగీతాన్నందించాడని దర్శకుడు పేర్కొన్నారు. ఈ సినిమాలో సూర్య పాత్రలో కనిపిస్తారు నాని. కోపాన్ని క్రమపద్ధతిలో వాడుకుంటూ శనివారాలను మాత్రమే ముహూర్తాలుగా ఎంచు కొని శత్రువులను వేటాడే వ్యక్తిగా ఆయన కొత్త పంథాలో కనిపిస్తారు అని చిత్ర బృందం పేర్కొంది. ప్రియాంక అరుళ్ మోహన్, ఎస్‌జే సూర్య తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: మురళి.జి, సంగీతం: జేక్స్ బిజోయ్, రచన-దర్శకత్వం: వివేక్ ఆత్రేయ.