ఐదేళ్ల కిందట బాలీవుడ్‌లో స్త్రీ సినిమా సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. కేవలం పదిహేను కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా నూటా ఎనభై కోట్ల రేంజ్‌లో కలెక్షన్‌లు కొల్లగొట్టింది. కామెడీ హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా హిందీ జనాలను విపరీతంగా ఆకట్టుకుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/45af6911-9449-466d-a7e1-ba146800284b-124-4-258.jpg)
శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావు జోడీగా దర్శకుడు అమర్ కౌశిక్ తెరకెక్కించిన హారర్ కామెడీ స్త్రీ. భారీ విజయం అందుకున్న ఈ చిత్రానికి కొనసాగింపుగా జియో స్టూడియోస్ స్త్రీ 2ని నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో శ్రద్దతో కలిసి పాల్గొంటున్నట్టు రాజ్‌కుమార్ రావు ప్రకటించాడు. ఆమెతో కలిసి ఉన్న ఓ సరదా ఫొటోని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నాడు. స్త్రీ, పురుషుడు మళ్లీ కలిస్తే ఏం జరుగుతుందో తెరపై చూడండి అనే వ్యాఖ్యను జోడిరచారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/638bff07-efd2-4cc9-8546-98039833db3c-132-4-258.jpg)
డిసెంబర్ వరకు బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్‌తో బిజీగా చిత్రబృందం గడపనున్నట్లు తెలుస్తుంది. వీఎఫ్‌ఎక్స్, మిగితా ప్యాచ్ వర్క్ కోసం నాలుగైదు నెలలు టైమ్ తీసుకోనుందని టాక్. వచ్చే ఏడాది ఆగస్టు 31న ఈ సినిమా రిలీజ్ కాబోతుందని ఇదివరకే నిర్మాత దినేష్ విజన్ అనౌన్స్ చేశాడు. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించినున్న ఈ సినిమా తొలిపార్టు మధ్యప్రదేశ్‌లోని చండేరి అనే చిన్న టౌన్ నేపథ్యంలో జరిగింది. ఇప్పుడు కూడా ఇదే ఊరును బేస్ చేసుకుని సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-126-4-257.jpg)