Skip to main content

Namaste NRI

భయపెట్టే స్త్రీ 2

ఐదేళ్ల కిందట బాలీవుడ్‌లో స్త్రీ  సినిమా సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. కేవలం పదిహేను కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా నూటా ఎనభై కోట్ల రేంజ్‌లో కలెక్షన్‌లు కొల్లగొట్టింది. కామెడీ హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా హిందీ జనాలను విపరీతంగా ఆకట్టుకుంది.

 శ్రద్ధాకపూర్‌, రాజ్‌కుమార్‌ రావు జోడీగా దర్శకుడు అమర్‌ కౌశిక్‌ తెరకెక్కించిన హారర్‌ కామెడీ స్త్రీ. భారీ విజయం అందుకున్న ఈ చిత్రానికి కొనసాగింపుగా జియో స్టూడియోస్‌ స్త్రీ 2ని నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో శ్రద్దతో కలిసి పాల్గొంటున్నట్టు రాజ్‌కుమార్‌ రావు ప్రకటించాడు. ఆమెతో కలిసి ఉన్న ఓ సరదా ఫొటోని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నాడు. స్త్రీ, పురుషుడు మళ్లీ కలిస్తే ఏం జరుగుతుందో తెరపై చూడండి అనే వ్యాఖ్యను జోడిరచారు.

డిసెంబర్‌ వరకు బ్యాక్‌ టు బ్యాక్‌ షెడ్యూల్స్‌తో బిజీగా చిత్రబృందం గడపనున్నట్లు తెలుస్తుంది. వీఎఫ్‌ఎక్స్‌, మిగితా ప్యాచ్‌ వర్క్‌ కోసం నాలుగైదు నెలలు టైమ్‌ తీసుకోనుందని టాక్‌. వచ్చే ఏడాది ఆగస్టు 31న ఈ సినిమా రిలీజ్‌ కాబోతుందని ఇదివరకే నిర్మాత దినేష్ విజన్‌ అనౌన్స్‌ చేశాడు. అమర్‌ కౌశిక్‌ దర్శకత్వం వహించినున్న ఈ సినిమా తొలిపార్టు మధ్యప్రదేశ్‌లోని చండేరి అనే చిన్న టౌన్‌ నేపథ్యంలో జరిగింది. ఇప్పుడు కూడా ఇదే ఊరును బేస్‌ చేసుకుని సీక్వెల్‌ను ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events