Namaste NRI

ఈగల్ నుంచి సెకండ్  సింగిల్

రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ఈగల్‌. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాత. అనుపమ పరమేశ్వరన్‌, నవదీప్‌, శ్రీనివాస్‌ అవసరాల, మధుబాల, ప్రణీత పట్నాయక్‌, అజయ్‌ఘోష్‌ తదితరులు నటిస్తున్నారు.   ఈ సినిమాలోని రెండో గీతం గల్లంతే  ఈ నెల 27న రిలీజ్‌ కానుంది.ఈ సందర్భం గా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. మనసుకు హత్తుకునే మెలోడీగా ఈ పాట సంగీత ప్రియులను అలరిస్తుంద ని, ప్రణయ భావాలకు అద్దం పడుతుందని దర్శకుడు తెలిపారు.

ఈ సినిమాలో రవితేజ భిన్న కోణాలున్న పాత్రలో కనిపిస్తాడని, యూనిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ప్రేక్షకు లకు సరికొత్త అనుభూతిని పంచుతుందని నిర్మాత పేర్కొన్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకురానుంది.  ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్‌ ఘట్టమనేని, కమిల్‌ ప్లాకి, కర్మ్‌ చావ్లా, సంగీతం: డేవ్‌ జాంద్‌, సహ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల, ఎడిటింగ్‌, దర్శకత్వం: కార్తీక్‌ ఘట్టమనేని.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events