కెనడా డిప్యూటీ ప్రధానమంత్రి క్రిష్టియా ఫ్రీలాండ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సుంకాలు పెంచుతామని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సరిగ్గా స్పందించనందుకు అసంతృప్తితో డిప్యూటీ ప్రధాని పదవి నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు.
క్యాబినెట్‌లో అత్యంత శక్తిమంతమైన మహిళగా ఆమె గుర్తింపు ఉన్నది. విధాన నిర్ణయాలకు సంబంధించి ట్రూడోకు, ఆమెకు భేదాభిప్రాయాలు తలెత్తినట్టు స్థానిక మీడియా పేర్కొన్నది. దేశ ఆర్థిక సవాళ్లకు సంబంధించిన విషయాలను పార్లమెంట్‌కు వివరించాల్సిన కొద్ది గంటల ముందే ఆమె తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం.