హథీరామ్ బాలాజీ క్రియేషన్స్ పతాకంపై కేపీఎన్ చౌహాన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా సేవాదాస్. ప్రీతి అస్రానీ నాయికగా నటిస్తున్నది. సుమన్, భాను చందర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. బంజారా సంస్కృతిని, ఔన్నత్యాన్ని చాటేలా ఈ సినిమా తెరకెక్కించామని దర్శకుడు అన్నారు. ఈ వేడుకలో చిత్ర బృందంతో పాటు డాక్టర్ బెల్లయ్య నాయక్, డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ చౌహాన్, భూక్య భారతి, పిర్యా నాయక్, రమేష్ నాయక్ పాల్గొన్నారు. ఇస్లావత్ వినోద్ రైనా, సీతారామ్ నాయక్ నిర్మాతలు. ఈ నెల 18న తెలుగుతో పాట బంజారా, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల అవుతున్నది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)