Skip to main content

Namaste NRI

18న వస్తున్న సేవాదస్

హథీరామ్‌ బాలాజీ క్రియేషన్స్‌ పతాకంపై కేపీఎన్‌ చౌహాన్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా సేవాదాస్‌. ప్రీతి అస్రానీ నాయికగా నటిస్తున్నది. సుమన్‌, భాను చందర్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. బంజారా సంస్కృతిని, ఔన్నత్యాన్ని చాటేలా ఈ సినిమా తెరకెక్కించామని దర్శకుడు అన్నారు. ఈ వేడుకలో చిత్ర బృందంతో పాటు డాక్టర్‌ బెల్లయ్య నాయక్‌, డాక్టర్‌ రాజ్‌ కుమార్‌ జాదవ్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌ శర్మన్‌ చౌహాన్‌, భూక్య భారతి, పిర్యా నాయక్‌, రమేష్‌ నాయక్‌ పాల్గొన్నారు. ఇస్లావత్‌ వినోద్‌ రైనా, సీతారామ్‌ నాయక్‌ నిర్మాతలు. ఈ నెల 18న తెలుగుతో పాట బంజారా, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో విడుదల అవుతున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events