పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్‌పై అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రత్యర్థి కమలా హారిస్ కు టేలర్ స్విఫ్ట్ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. తాను కమలాకే ఓటు వేస్తానని వెల్లడించారు. అయితే, టేలర్ ప్రకటన ను ట్రంప్ జీర్ణించుకోలేకపో తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ప్రకటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టేలర్ కచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నేను టేలర్ అభిమానిని కాదు. ఆమె ఎప్పుడూ డెమోక్రాట్లనే సమర్థిస్తున్నట్లు అనిపిస్తోంది. అందుకు ఆమె భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.