డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ అయితే ఆమెను ఓడించడం మరింత సులువని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అధ్యక్ష పదవి రేస్ నుంచి జో బైడెన్ తప్పుకున్న తర్వాత ఆయన స్పందించారు. బైడెన్ కంటే కమలా హారిస్ ను ఓడించడం ఇంకా సులభమని ధీమా వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో అత్యంత చెత్త అధ్యక్షుడు జో బైడెన్ అంటూ ఫైర్ అయ్యారు.
![](https://namastenri.net/wp-content/uploads/2024/07/f8900b5f-232d-4ed0-9e9a-f342ae9bc1c6-113.jpg)
అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి జో బైడెన్ తగినవాడు కాదని చెప్పారు. ఆ హోదాలో పనిచేసే అర్హత ఆయనకు ఏనాడూ లేదు. అతను కేవలం అబద్ధాలు, తప్పుడు సమాచార వ్యాప్తి ద్వారా అధ్యక్ష పదవిని పొందారు. మీడియా, వైద్యులు సహా చుట్టూ ఉన్న అందరికీ ఆయన అధ్యక్ష హోదాలో ఉండడానికి అర్హుడు కాదని తెలుసు. ఆయన పాలన వల్ల మనం చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నా. వాటిని వీలైనంత త్వరగా చక్కబెడతామన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2024/07/50e409c6-592a-4e9f-922f-2a94141522d8-109.jpg)