మిస్ ఎంపవరింగ్ యూనివర్స్ 2023గా శిల్ప రేవూరి నిలిచారు. మిస్ ఎలైట్ ఇండియా డబ్ల్యూఏ 2023 తొలి రన్నరప్‌గాను ఆమె ఎంపికయ్యారు. ఆంపవరింగ్ గ్లోబల్ ఉమెన్ ఫెస్టివల్ 11వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో శిల్ప విజేతగా నిలిచారు. యూఎస్ కేంద్రంగా పనిచేసే ఆంపవరింగ్ సంస్థ ఈ పోటీలను నిర్వహించింది. ఇది ఎలాంటి లాభాపేక్ష లేని సంస్థ. దీనికి మెంకా సోని నిధులను సమకూర్చారు. ఆంపవ రింగ్ సంస్థ గ్లోబల్ అవార్డ్స్ గుర్తింపు పొందింది. అమెరికాలోని వాషింగ్టన్, ఒరెగాన్ రాష్ట్రాల్లో చాలా సంవత్సరా లుగా సంస్థ ఆధ్వర్యంలో పలు కేటగిరీల్లో భారతీయుల కోసం పోటీలు నిర్వహిస్తోంది. మిస్ ఎంపవరింగ్ యూనివర్స్ 2023గా నిలిచిన శిల్ప రేవూరి స్వస్థలం తెలంగాణలోని ఆదిలాబాద్. మైక్రోసాఫ్ట్‌లో సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ అయిన శిల్పకు భర్త రామ్, ఇద్దరు పిల్లలు. కుటుంబపరంగా ఎలాంటి నేపథ్యం లేనప్పటికీ శిల్ప తొలిసారి ఈ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచారు.