బ్రిటన్ ప్రధాని పదవి రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్ వెనకబడ్డారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్షుడు దేశ ప్రధాని పదవికి పోటీ పడుతున్న ఆయన ప్రత్యర్థి లిజ్ ట్రస్ అధిక్యంలో ఉన్నట్లు ఒపినియమ్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో పేర్కొంది. 61 శాతం మంది లిజ్ ట్రస్‌కు ఓటేస్తే, కేవలం 39 శాతం మంది మాత్రమే రిషి సునాకకు అనుకూలమని చెప్పారు. లిజ్ ట్రస్ ఆధిక్యంలో కొనసాగుతున్నా కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్షుడిగా, బ్రిటన్ ప్రధానిగా ఎన్నికయ్యేందుకు రిషి సునాక్‌కు అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సీనియర్లు లిజ్ ట్రస్‌కు మద్దతు ఇస్తున్నారు. యువతరం మాత్రం రిషి సునాక్‌కు అనుకూలంగా ఉన్నారని తెలుస్తున్నది.
వచ్చే నెల రెండో తేదీ వరకు కన్జర్వేటివ్ పార్టీ నేతను ఎన్నుకోవడానికి గడువు ఉంది. ఆ లోగా కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఆన్లైన్లో గానీ, పోస్టల్ ద్వారా గానీ తమ ఓట్లు వేయాల్సి ఉంటుంది. వచ్చే నెల ఐదో తేదీన ఫలితాలు వెలవడతాయి. అదే రోజు కన్జర్వేటివ్ పార్టీ అధినేతగా గెలిచిన అభ్యర్థే దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తారు.