Namaste NRI

వైఎస్ జగన్ కు షాక్.. సమన్లు జారీ చేసిన సీబీఐ కోర్టు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోమన్‌ రెడ్డికి సీబీఐ, ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. వాన్‌పిక్‌ ప్రాజెక్టు వ్యవహారంలో మనీలాండరింగ్‌ అంశంపై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు… సెప్టెంబర్‌ 22న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.  రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకరమణకు కూడా సీబీఐ, ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, ఐఆర్‌ టీఎస్‌ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డితో పాటు పారిశ్రామికవేత్తతలు నిమ్మగడ్డ ప్రసాద్‌, నిమ్మగడ్డ ప్రకాష్‌కూ కోర్టు సమన్లు జారీ అయ్యాయి. విశ్రాంత  ఐఏఎస్‌ అధికారులు ఎం.శామ్యూల్‌, మన్మోహన్‌ సింగ్‌కూ సమన్లు జారీ అయ్యాయి. జగతి పబ్లికేషన్స్‌ సహా 12 కంపెనీలకు సీబీఐ, ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది.

                వాన్‌పిక్‌ వ్యవహారంలో చేతులు మారిన సొమ్ముపై మనీలాండరింగ్‌ నిరోధక చట్టం ప్రకారం ఈడీ విచారణ జరిపింది. వివిధ కంపెనీల ద్వారా సొమ్ము చలామణి అయినట్లు ఈడీ గుర్తించింది. ఈ కేసులో జగన్‌ కంపెనీలకు చెందిన రూ.538 కోట్లు విలువైన ఆస్తులతో పాటు వాక్‌ పిక్‌ భూములు సహా  నిమ్మగడ్డ కంపెనీలకు చెందిన రూ.325 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసిన విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress