అమెరికాలోని బెలిజ్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విమానం గాల్లో ఉండగా ఓ ప్రయాణికుడు హైజాక్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే, తోటి ప్రయాణికుడు కాల్పులు జరపడంతో నిందితుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ట్రాపిక్ ఎయిర్ కు చెందిన ఓ చిన్న విమానం కొరొజాల్ నుంచి శాన్ పెడ్రోకు వెళ్తోంది. విమానం కొరొజాల్ ఎయిర్‌పోర్ట్‌లో టేకాఫ్ తీసుకుంది. విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికి అందులోని ఓ ప్రయాణికుడు కత్తితో ప్రయాణికులకు బెదిరించాడు. విమానం హైజాక్ చేసేందుకు ప్రయత్నించాడు. కొందరు ప్రయాణికుల్ని గాయపరిచాడు కూడా. అతడి చర్యకు ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇంతలో ఓ ప్రయాణికుడు తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్ తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పు్ల్లో నిందితుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ప్రమాద సమయంలో విమానంలో 14 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిని అమెరికా పౌరుడు 49 ఏళ్ల అకిన్యేలా సావా టేలర్‌గా గుర్తించారు. ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బెలిజ్ పోలీసు కమిషనర్ చెస్టర్ విలియమ్స్ తెలిపారు.
