రామ్ పోతినేని కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల థియేట్రికల్ రైట్స్‌ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్ మెంట్ సంస్థ సొంతం చేసుకున్నది. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నా మని ప్రైమ్‌షో సంస్థ నిర్మాతలు నిరంజన్ రెడ్డి, చైతన్యరెడ్డి తెలిపారు.
ఇప్పటివరకు విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించిందని, ఈ సినిమాలో ఓల్డ్‌సిటీ శంకర్‌గా రామ్ పాత్ర మాస్ అంశాలతో ఆకట్టుకుంటుందని, ప్రేక్షకులకు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ అని చిత్ర బృందం పేర్కొంది. కావ్య థాపర్, అలీ, గెటప్ శ్రీను తదితరులు నటిస్తున్నారు. ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకురాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, జియాని జియాన్నెలి, సంగీతం: మణిశర్మ, నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మికౌర్, రచన-దర్శకత్వం: పూరి జగన్నాథ్.