స్పేస్‌ఎక్స్ పొలారిస్ డాన్ మిషన్ వ్యోమగామి బృందం ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రైవేట్ స్పేస్‌వాక్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. బిలియనీర్ జేర్‌డ్ ఐసాక్‌మ్యాన్ మొదట నడవగా ఆ తర్వాత స్పేస్‌ఎక్స్ ఇంజినీర్ సరహ్ గిల్లిస్ ఆయనను అనుసరించారు. అంతరిక్ష నడకను కేవలం 30 నిమిషాల పాటు నిర్వహించారు. కానీ దీనికి సిద్ధం కావడానికి రెండు గంటలు పట్టింది. ఈ కార్యక్రమంలో కొత్త అంతరిక్ష దుస్తులను పరీక్షించారు. ఐసాక్‌మ్యాన్ అంతరిక్షంలో ఉన్న ఫొటోను స్పేస్‌ఎక్స్ సీఈవో మస్క్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. టేకాఫ్ అయిన 15 గంటల తర్వాత 1400.7 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకొని పొలారిస్ డాన్ మిషన్ అరుదైన మైలురాయిని సాధించింది.