ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ ప్రయోగించిన అతిపెద్ద రాకెట్ ప్రయోగం విఫలమైంది. టెక్సాస్‌కు దక్షిణం వైపున మెక్సికో సరిహద్దు నుంచి స్టార్‌షిప్ వ్యోమనౌకను ప్రయోగించారు. గతంలో రెండు టెస్ట్ ఫ్లైట్ లు ప్రయోగ సమయంలోనే విఫలం కాగా, గురువారం నాటి స్టార్‌షిప్ మాత్రం విజయవంతంగా నింగిలోకి ఎగిరింది. నిర్దేశించిన సమయానికి రాకెట్ నుంచి బూస్టర్ సైతం వేరు పడింది. దీంతో ప్రయోగం విజయవంత మవుతుందని భావిస్తుండగానే రాకెట్ నుంచి సంబంధాలను కోల్పోయినట్టు శాస్త్రవేత్తలు ప్రకటించారు.
