
సాయిదుర్గతేజ్ హీరో గా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సంబరాల ఏటిగట్టు. రోహిత్ కె.పి దర్శకుడు. కె.నిరంజన్రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మాతలు. నటుడు శ్రీకాంత్ ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇందులో ఆయన పోషిస్తున్న బ్రిటిషు పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. రగ్గడ్ హెయిర్, గడ్డంతో బ్లాక్ కోట్ ధరించి ఫెరోషియస్‌గా కనిపిస్తున్న శ్రీకాంత్‌ని ఈ పోస్టర్‌లో చూడొచ్చు. ఇప్పటికే విడుదలైన కార్నేజ్ టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిందని, లార్జర్ దెన్ లైఫ్ మేనర్‌లో సాయిదుర్గతేజ్ పాత్రను దర్శకుడు రోహిత్ ప్రజెంట్ చేశారని, శరవేగంగా చిత్రీకరణ సాగుతుందని మేకర్స్ తెలిపారు. 125కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఐశ్వర్యలక్ష్మీ కథానాయిక. జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ఇతర పాత్రధారులు. సెప్టెంబర్ 25న పానిండియా స్థాయిలో సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: వెట్రివేల్ పళనిస్వామి, సంగీతం: బి.అజనీష్ లోక్నాథ్, నిర్మాణం: ప్రైమ్‌షో ఎంటైర్టెన్మెంట్స్.
