హీరో రామ్ కొత్త చిత్రం కోడి బుర్ర హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శృతిమీనన్ కథానాయిక. చంద్రశేఖర్ కానూరి దర్శకుడు. వీ4 క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత బెక్కెం వేణుగోపాల్ క్లాప్‌నివ్వగా, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కెమెరా స్విఛాన్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశమిదని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాలో తాను పోలీసాఫీసర్‌గా నటిస్తున్నానని, ఆద్యంతం ఉత్కంఠభరితమైన మలుపులతో కథ సాగుతుందని హీరో శ్రీరామ్ అన్నారు.
ఈ నెల 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శ్రీకాంత్ కొండా, సంగీతం: సుకుమార్ రాగ, నిర్మాతలు: కంచర్ల సత్యనారాయణ రెడ్డి, గట్టు విజయ్ గౌడ్, చిన్ని చందు, వట్టం రాఘవేంద్ర, సముద్రాల మహేష్ గౌడ్, రచన-దర్శకత్వం: చంద్రశేఖర్ కానూరి.