Namaste NRI

అక్రమ అరెస్టులు, నిర్బంధాలను తీవ్రంగా ఖండిస్తున్నా : నవీన్ రెడ్డి

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి నేతృత్వంలో లండన్లోని టవర్ బ్రిడ్జి వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులు పూర్తయినా, 2023 ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేయకపోవడంతో, నిరసనగా ప్లకార్డులు పట్టుకొని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా నవీన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 420 రోజులు గడిచినా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజల పట్ల చిత్తశుద్ధి లేకపోవడానికి నిదర్శనమని అన్నారు. గత 420 రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేయడమే కాకుండా, ప్రశ్నించే ప్రతి పక్షాల గొంతు నొక్కేందుకు అక్రమ అరెస్టులు, నిర్బంధాలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని 20 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లిందని విమర్శించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events