సుహాస్, సంగీర్తన జంటగా నటిస్తున్న తాజా చిత్రం జనక అయితే గనక. సందీప్ రెడ్డి బండ్ల దర్శకుడు. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మిస్తున్నారు. ట్రైలర్‌ను విడుదల చేశారు . పెళ్లయినప్పటికీ పిల్లలు వద్దనుకుంటాడు హీరో సుహాస్. అందుక్కారణం ఖర్చులు బాగా పెరిగిపోతాయని అతని భయం.పిల్లల్ని కనమని కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా అతను ససేమిరా అంటుంటాడు. ఈ నేపథ్యంలో తన భార్య గర్భవతి అని తెలిసినప్పుడు హీరో ఏం చేశాడు? ఆ తర్వాత జరిగిన పరిణామాలేమిటి? అనే అంశాలతో ట్రైలర్ ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది. చక్కటి వినోదాత్మక కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, ప్రతి ఒక్కరికి నచ్చుతుందని, నాన్‌స్టాప్ కామెడీతో మెప్పిస్తుందని దిల్‌రాజు తెలిపారు. సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకురానుంది.ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్.